64 కోట్ల షేర్ సాధించిన ఎఫ్ 2

Published on Jan 23,2019 03:17 PM

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ లు నటించిన ఎఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లోనే 64 కోట్ల షేర్ సాధించి సంచలనం సృష్టించింది . సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఎఫ్ 2 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . వెంకటేష్ సరసన తమన్నా నటించగా వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటించింది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ఇంకా ప్రేక్షకులు వసూల్ వర్షం కురిపిస్తూనే ఉన్నారు . 

ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు 64 కోట్ల షేర్ రాబట్టింది . వెంకటేష్ కెరీర్ లో ఇంతటి భారీ షేర్ సాధించిన చిత్రం లేదు , అలాగే వరుణ్ తేజ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది ఎఫ్ 2 . హీరోలకు మాత్రమే  కాదు హీరోయిన్ లు తమన్నా , మెహరీన్ లకు గతకొంత కాలంగా సక్సెస్ లేదు దానికి తోడు నిర్మాత దిల్ రాజు కూడా నష్టాలలో ఉన్నాడు ఈ ఒక్క సినిమా అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది .