ఎఫ్ 2 విశ్వక్ సేన్ కు నచ్చలేదట !

Published on Apr 01,2020 01:58 PM
యంగ్ హీరో విశ్వక్ సేన్ కు ఎఫ్ 2 చిత్రం నచ్చలేదట ! దాంతో ఆ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ - తమన్నా , వరుణ్ తేజ్ - మెహరీన్ జంటలుగా నటించగా అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఎఫ్ 2 వెంకటేష్ కెరీర్ లోనే కాకుండా వరుణ్ తేజ్ కెరీర్ లో కూడా అతిపెద్ద విజయాన్ని అందుకుంది. అయితే అలాంటి సినిమా మాత్రం విశ్వక్ సేన్ కు అస్సలు నచ్చలేదట ! పైగా అది పాతచింతకాయ పచ్చడి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఫలక్ నుమా దాస్ చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న ఈ హీరో అగ్రెస్సివ్ అన్న విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించే ఈ హీరో ఇటీవలే హిట్ అనే చిత్రంతో హిట్ కొట్టాడు. ఇక తాజాగా పాగల్ అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు కానీ ఈలోపే కరోనా ఎఫెక్ట్ ఎక్కువ కావడంతో షూటింగ్ లన్నీ ఆగిపోయాయి.