50 రోజులు పూర్తిచేసుకున్న ఎఫ్ 2

Published on Mar 02,2019 12:09 PM

సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఎఫ్ 2 సంచలన విజయం సాధించింది. నేటితో దిగ్విజయంగా అర్ధ శతదినోత్సవాన్ని పూర్తిచేసుకుంది ఎఫ్ 2. సీనియర్ హీరో వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించగా వరుణ్ తేజ్ - మెహరీన్ మరో జంటగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. 

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఎఫ్ 2 యాభై రోజుల్లో 140 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించింది. ప్రస్తుతం 106 కేంద్రాల్లో 50 రోజులను పూర్తిచేసుకుంది. దాంతో ఈరోజు హైదరాబాద్ లో ఓ స్టార్ హోటల్ లో అర్ధ శతదినోత్సవాన్ని భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఎఫ్ 2 ప్రభంజనం సృష్టించింది. దాంతో ఎఫ్ 3 కి సన్నాహాలు చేస్తున్నారు.