అనిల్ రావిపూడి అరెస్ట్!

Published on Feb 02,2019 04:14 PM
దర్శకులు అనిల్ రావిపూడి అరెస్ట్ అయ్యాడు , ఇంతకీ అనిల్ ని అరెస్ట్ చేసింది ఎవరో తెలుసా ..... హీరో వరుణ్ తేజ్ . ఎందుకు అరెస్ట్ చేసాడో తెలుసా ...... థియేటర్ లో ప్రేక్షకులను పగలబడి నవ్వించినందుకు . వెంకటేష్ - వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ఎఫ్ 2 . సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహారథం పట్టారు . 

ఇప్పటికే ఈ సినిమా 72 కోట్లకు పైగా షేర్ సాధించింది దాంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . ఇక సరదా కోసం , ఎఫ్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ రావిపూడి ని అరెస్ట్ చేసాడు వరుణ్ తేజ్ . అయితే అప్పటి ఫోటోలను ఇప్పుడు ట్వీట్ చేసి థియేటర్ లో ప్రేక్షకులను బాగా నవ్వించినందుకు అరెస్ట్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేసాడు . దానికి అందరూ నవ్వుకుంటున్నారు ఈ సరదా ట్వీట్ చూసి . 

ఎఫ్ 2 , వరుణ్ తేజ్ , అనిల్ రావిపూడి , దిల్ రాజు , వెంకటేష్ , venkatesh , varun tej , anil ravipudi , dil raju , F2 , film news ,