ప్రభాస్ కు గ్రీటింగ్స్ వెల్లువ

Published on Oct 23,2019 12:20 PM
ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు దాంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది దాంతో సోషల్ మీడియాలో పెద్ద తుఫాన్ లా మారింది గ్రీటింగ్స్ . ప్రభాస్ కు అబ్బాయిలు మాత్రమే కాదు అందమైన అమ్మాయిలలో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంకా ప్రభాస్ కు పెళ్లి కాకపోవడంతో అమ్మాయిల కళల రాకుమారుడు అవుతున్నాడు ప్రభాస్. మరో విశేషం ఏంటంటే ఈ హీరోకు 40 పూర్తి అవుతున్నాయి అయినా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. ఈ పుట్టినరోజు సందర్బంగానైనా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ? చూడాలి. బాహుబలి తర్వాత వచ్చిన సాహో ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు కానీ భారీ వసూళ్ల నే సాధించి ప్రభాస్ స్టామినా ఏంటో చాటిచెప్పింది.