ఎవరు ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Published on Aug 23,2019 01:13 PM

వెంకట్ రాంజీ దర్శకత్వంలో అడవి శేష్ , రెజీనా కాసాండ్రా , నవీన్ చంద్ర నటించిన చిత్రం ఎవరు సంచలనం సృష్టిస్తోంది . ఆగస్టు 15 న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో వరల్డ్ వైడ్ గా వారం రోజుల్లోనే 10 కోట్ల షేర్ వసూల్ అయ్యింది . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లో సైతం మంచి వసూళ్లు వచ్చాయి ఎవరు చిత్రానికి . 

అడవి శేష్ కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కాసాండ్రా పాత్ర హైలెట్ గా నిలిచింది . గతకొంత కాలంగా వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సమయంలో రెజీనా కు ఎవరు రూపంలో బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇక పివిపి నిర్మించిన ఈ చిత్రంతో పివిపి కూడా మంచి హిట్ కొట్టాడు . అడవి శేష్ కు మరోసారి ఎవరు రూపంలో మరో హిట్ లభించింది .