ఎంత మంచి వాడవురా ట్రైలర్ టాక్

Published on Jan 08,2020 11:08 PM

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎంత మంచి వాడవురా ట్రైలర్ విడుదల అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అథితిగా హాజరుకాగా నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ వేడుకకు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది. యాక్షన్ తో పాటుగా సెంటిమెంట్ , లవ్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండగ తెలుగువాళ్ళకు పెద్ద పండగ కాబట్టి ఆ పండగ రోజులను బాగానే క్యాష్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది ఎంత మంచి వాడవురా.

నందమూరి కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్ పీర్జాదా నటించగా భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందింది. ఇక సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. జనవరి 15 న ఎంత మంచి వాడవురా విడుదల అవుతోంది. శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఎంత మంచి వాడవురా చిత్రం పై ఆశలు బాగానే ఏర్పడ్డాయి. దానికి తోడు కళ్యాణ్ రామ్ మంచి మనసున్న హీరో కాబట్టి మరింతగా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి.