ఇలియానా ప్రియుడితో విడిపోయింది

Published on Aug 27,2019 11:18 AM

హాట్ భామ ఇలియానా తన పెళ్లి కానీ మొగుడు అని భావించిన ఆండ్రు నీబోన్ తో విడిపోయిందని జాతీయ మీడియా కథనాలు పుంఖాను పుంఖాలుగా రాస్తూనే ఉంది. ఇక ఈ కథనాలపై ఇలియానా స్పందించలేదు. ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రు నీబోన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగింది ఇల్లీ బేబీ, అతడితో సహజీవనం చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఇక ఆండ్రు కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేసాడు ఎక్కడో తేడా కొట్టింది ఇంటికెళ్ళొస్తా అంటూ చెక్కేసాడు ఆస్ట్రేలియాకు. 

ఇక ఇక్కడ వస్తాడు నారాజు అంటూ వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉండిపోయింది. అక్కడికి వెళ్ళాకా మనోడు తన బుద్దిని చూపించి ఉంటాడు దాంతో ప్రియుడిపై కోపంతో ఉన్న ఇలియానా అతడితో కలిసి దిగిన ఫోటోలను అన్నింటిని డిలీట్ చేసింది. అలాగే ఒకరినొకరు అన్ ఫాలో కూడా అయ్యారు.