నట విశ్వరూపం చూపించిన ఈషా రెబ్బా

Published on Nov 22,2019 04:47 PM

తెలుగమ్మాయి ఈషా రెబ్బా తాజాగా నటించిన చిత్రం '' రాగల 24 గంటల్లో ''. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈషా రెబ్బా తన అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే మరోవైపు తనదైన నటనతో కట్టిపడేసింది. అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ భామకు మొదటి చిత్రమే మంచి విజయాన్ని ఇచ్చింది . అయితే ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది పాపం. చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవ్వడంతో ఈషా రెబ్బా కు అంతగా స్టార్ డం రాలేదు.

పైగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లభించలేదు. కానీ తాజాగా నటించిన రాగల 24 గంటల్లో చిత్రంతో ఈషా రెబ్బా సత్తా ఏంటో చాటి చెప్పింది. సరైన పాత్ర లభిస్తే తన నట విశ్వరూపం ఏంటో చూపించే సత్తా ఉన్న నటి అని ప్రేక్షకుల చేత కొనియాడబడుతోంది ఈషా రెబ్బా. తెలుగమ్మాయిలు రావడం లేదు , వచ్చినా నటన అంతగా రాదు , గ్లామర్ గా నటించలేరు అంటూ రకరకాల చెత్త కారణాలు చెప్పే వాళ్లకు ఈషా రెబ్బా గూబ గుయ్ మనేలా నటించి చూపించింది. మొత్తానికి ఈషా రెబ్బా కు ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు రావాలని......  స్టార్ హీరోయిన్ కావాలని ఆశిద్దాం.