డివివి దానయ్య కొడుకు కూడా హీరో అవుతున్నాడు

Published on Nov 22,2019 10:35 PM

టాలీవుడ్ లో వారసుల రాజ్యం నడుస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు వారసులు టాలీవుడ్ ని ఏలుతున్నారు ఇక మరికొంతమంది సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈవారసుల లిస్ట్ లోకి అగ్ర నిర్మాత డివివి దానయ్య  కొడుకు కూడా చేరుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్.

భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న దానయ్య తన కొడుకు కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తన కొడుకు కళ్యాణ్ సరసన నటించే భామగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేశారట. అయితే ఈ చిత్రాన్ని తాను నిర్మించకుండా మరొకరికి నిర్మాణంలో చేయాలనీ చూస్తున్నాడట. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి దానయ్య కొడుకు కూడా హీరో అవుతున్నాడు.