50 లక్షలు వెనక్కి ఇచ్చాడట

Published on Jan 23,2019 04:02 PM

వినయ విధేయ రామ చిత్రం ఘోర పరాజయం పొందింది దాంతో ఓవర్ సీస్ లో దారుణంగా నష్టపోయాడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన బయ్యర్ అందుకే ఆ నష్టంలో కొంత భాగమైన భరించాలని భావించిన నిర్మాత దానయ్య 50 లక్షలను వెనక్కి ఇచ్చాడట . రాంచరణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . 

జనవరి 11న విడుదలైన వినయ విధేయ రామ చిత్రం 60 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది అయితే ఓవర్ సీస్ లో మాత్రం అసలు ఓపెనింగ్స్ రాలేదు మాస్ సినిమా కావడంతో . అలాగే ఓవర్ సీస్ మాత్రమే కాదు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లు కూడా తీవ్రంగా నష్టపోయారు . అయితే ఇక్కడి బయ్యర్ లతో మాట్లాడలేదు కానీ ఓవర్ సీస్ బయ్యర్ కు మాత్రం ఓ యాభై లక్షలు మాత్రం ఇచ్చాడట దానయ్య .