అల ..... వైకుంఠపురములో డబ్బింగ్ స్టార్ట్ అయ్యింది

Published on Nov 12,2019 10:48 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '' అల ...... వైకుంఠపురములో ''. ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయ్యింది. భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొత్త ఏడాది 2020లో జనవరి 12 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు అల్లు అర్జున్ - పూజా హెగ్డే లపై సూపర్ హిట్ సాంగ్ '' సామజవరగమనా '' అనే పాటని ప్యారిస్ లోని అందమైన లొకేషన్ లలో చిత్రీకరిస్తున్నారు.

అలాగే మరోవైపు డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసారు. ఇలా గ్యాప్ లేకుండా చేయడం వల్ల అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయడం ఇబ్బంది కాదని ఇప్పుడే డబ్బింగ్ స్టార్ట్ చేశారట. ఇక అల్లు అర్జున్ ఇండియాకు తిరిగి వచ్చాక తన డబ్బింగ్ పూర్తి చేయనున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు 2 పాటలు విడుదల చేయగా రెండు కూడా యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి.