డ్రైవర్ రాముడు సెకండ్ సింగల్ విడుదల

Published on Mar 05,2019 11:46 AM
షకలక శంకర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'డ్రైవర్‌ రాముడు'. హర్షిత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ సత్య దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్‌ ప్రణవ్‌ తేజ్‌ సమర్పణలో సినిమా పీపుల్‌ పతాకంపై కె.వేణుగోపాల్‌, ఎం.ఎల్‌.రాజు, టి.కీరత్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల శివ శంకర్‌ మాస్టర్‌ నేతృత్వంలో లండన్‌ బ్యూటీ స్కార్లెట్‌ విల్సన్‌తో తెరకెక్కించిన పాటను విడుదల చేసిన సంగతి తెలిసిదందే. సోమవారం శివరాత్రి సందర్భంగా సెకండ్‌ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ...  పూర్తి వినోదాత్మకంగా సాగే చిత్రమిది. కథ, కథనం కొత్తగా ఉంటాయి. శంకర్‌ తన మార్క్‌ కామెడీతో ఆకట్టుకుంటారు. శివరాత్రి సందర్భంగా 'రాములోరి బాణం అయినా.. మాధవుడి గీత అయినా, మానవుడి మంచి అయిన' అంటూ సాగే పాటను విడుదల చేశాం. ఈ పాటకు పెద్ద సినిమాలకు పనిచేసే గణేష్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించడం విశేషం. సునీల్‌ కశ్యప్‌ సంగీతం, శివారెడ్డి కెమెరా పనితీరు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు సినిమా ఉంటుంది అని తెలిపారు. ప్రదీప్‌ రావత్‌, నాజర్‌, ధనరాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శివారెడ్డి, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఆర్ట్‌: రఘు కులకర్ణి.