ఎట్టకేలకు అర్జున వస్తున్నాడు

Published on Mar 09,2019 10:02 AM

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం పోషించిన చిత్రం '' అర్జున '' . కన్మణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది . అయితే ఈ సినిమా ఇప్పటిది కాదు , దాదాపు అయిదేళ్ల క్రితం నాటి సినిమా కానీ కష్టాల కడలి నుండి ఇన్నాళ్లకు బయటపడుతోంది . మహేంద్ర - ఉదయ్ శంకర్ లు నిర్మించిన ఈ చిత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది , అయితే అదే సమయంలో రాజశేఖర్ కు మార్కెట్ కూడా పడిపోయింది దాంతో అర్జున సినిమా రిలీజ్ కాలేదు . 

కట్ చేస్తే ఇన్నాళ్లకు సి . కళ్యాణ్ ముందుకు వచ్చి ల్యాబ్ లోనే ఉండాల్సిన సినిమాని రిలీజ్ చేస్తున్నాడు మార్చి 15న . రాజశేఖర్ సరసన రేఖ , మర్యమ్ జకారియా నటించగా కీలక పాత్రల్లో ఆహుతి ప్రసాద్ , కోట శ్రీనివాసరావు , చలపతిరావు తదితరులు నటించారు . అర్జున చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందా ? లేదా ? పక్కన పెడితే రిలీజ్ అవ్వడమే గొప్ప అన్నట్లుగా ఉంది .