నేను పిరికివాడ్ని : డాక్టర్ రాజశేఖర్

Published on Mar 12,2019 11:03 AM

నేను చాలా పిరికివాడిని ఓటమి తట్టుకోలేను అలాంటిది నేను మా ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ . ఆదివారం రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే . కాగా నరేష్ ప్యానల్ తరుపున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా  పోటీ చేసాడు రాజశేఖర్ . హీరో శ్రీకాంత్ పై విజయం సాధించాడు రాజశేఖర్ . 

మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం శివాజీరాజా - నరేష్ లు పోటీ పడగా నరేష్ విజయం సాధించాడు . దాంతో శివాజీరాజా వర్గం షాక్ అయ్యింది . శివాజీరాజా వర్గం నుండి పోటీ చేసిన వాళ్లలో ఎక్కువ మంది ఓటమి పాలయ్యారు . నరేష్ సంచలన విజయం సాధించడంతో మాపై గురుతర బాధ్యత ఉందని అందరినీ కలుపుకొని పోతామని అన్నాడు నరేష్ . జీవిత ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించడంతో భార్యాభర్తలైన జీవిత - రాజశేఖర్ లు సంతోషంగా ఉన్నారు .