రాజశేఖర్ కల్కి పై అంచనాలు పెంచుతోంది

Published on Feb 04,2019 11:05 AM

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తాజాగా నటిస్తున్న చిత్రం కల్కి . ఈరోజు డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో కల్కి టీజర్ ని రిలీజ్ చేసారు . కల్కి టీజర్ చూస్తుంటే తప్పకుండా సినిమా హిట్ అయ్యేలాగే కనిపిస్తోంది . చాలారోజులుగా కెరీర్ లో వెనుకబడిపోయిన ఈ హీరో గరుడ వేగ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు దాంతో ఇప్పుడు కల్కి అంటూ వస్తున్నాడు . 

అ ! చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . 1980 కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది . త్వరలోనే మిగతా పార్ట్ ని కంప్లీట్ చేసి మేలో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .