దొంగ టీజర్ వచ్చేసింది

Published on Nov 17,2019 08:33 AM

తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన చిత్రాన్ని తెలుగులో '' దొంగ '' గా డబ్ చేస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే జ్యోతిక కూడా నటించడం. రియల్ లైఫ్ లో వదినా - మరిది అయిన జ్యోతిక - కార్తీ లు ఈ దొంగ చిత్రంలో అక్కా - తమ్ముడిగా నటించడం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కార్తీ దొంగ గా నటిస్తున్నాడు.

ఈరోజు కొద్దిసేపటి క్రితం దొంగ టీజర్ ని విడుదల చేసారు. టీజర్ ఆకట్టుకునేలాగే ఉంది దానికి తోడు ఇటీవలే ఖైదీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు కార్తీ. ఆ సినిమా తర్వాత కార్తీ నుండి వస్తున్న చిత్రం కావడంతో సహజంగానే అంచనాలు భారీగానే ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే టీజర్ ఉంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో వయాకామ్ 18 స్టూడియోస్ అందిస్తోంది.