భక్త కన్నప్ప సినిమా తీయడం అంటే రిస్క్ చేయడమే

Published on Apr 19,2020 03:54 PM
మంచు విష్ణు భక్త కన్నప్ప అనే చిత్రాన్ని 90 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలని అనుకున్నాడు. అయితే మంచు విష్ణుకు మార్కెట్ అంతగా లేదు దాంతో ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడింది. ఇక ఈ సినిమాని ఈ ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసాడు. కానీ కరోనా మహమ్మారి వల్ల ఇక ఈ సినిమాని మంచు విష్ణు టచ్ చేయడం అంటే తెలిసి తెలిసి కొరివితో తల గోక్కవడమే అని అంటున్నారు విశ్లేషకులు.

మంచు విష్ణు హీరోగా రెండు మూడు సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు కానీ ఆశించిన స్థాయిలో స్టార్ డం అందుకోలేకపోయాడు. దాంతో సరైన మార్కెట్ లేకుండాపోయింది. దానికి తోడు కరోనా మహమ్మారి వల్ల ఎప్పుడు మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయో తెలియడం లేదు అలాగే సినిమాలకు జనాలు ఇప్పట్లో రావడం కూడా కష్టమే !  ఒకవేళ భక్త కన్నప్ప బ్లాక్ బస్టర్ గా నిలిచినా పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కూడా కష్టమే !