గోవాలో సినిమాలు తీయాలంటే అంత ఈజీ కాదు

Published on Feb 13,2020 11:53 PM

ఇంతకుముందు గోవాలో సినిమాలు తీయాలంటే పెద్దగా ఆంక్షలు ఏమి ఉండేవి కావు కానీ ఇప్పుడు మాత్రం అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. దాంతో షాక్ అవ్వడం సినిమావాళ్ళ వంతు అవుతోంది. గోవా ప్రభుత్వం ఆంక్షలు విధిచడానికి కారణం ఏంటో తెలుసా ....... గోవా నేపథ్యాన్ని ఎంచుకొని డ్రగ్స్ మాఫియా , సెక్స్ రాకెట్ కు అడ్డాగా చిత్రీకరిస్తున్నారని దాని వల్ల గోవా కున్న మంచి పేరుని సినిమావాళ్లు చెడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు అక్కడి ముఖ్యమంత్రి ప్రమోస్ సావంత్.

ఇకపై గోవాలో షూటింగ్ చేసుకునే వాళ్ళు ముందుగా తమ సినిమా నేపథ్యం ఏంటో చెబితే అప్పడూ గోవాలో పర్మీషన్ ఇస్తారట. అంతేకాని ఇంతకుముందు లాగా ఎలాంటి సన్నివేశాలనైనా , ఎలాంటి చిత్రాలకైనా అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారట. దాంతో ఇంతకుముందులా ఎక్కువ చిత్రాల షూటింగ్ గోవాలో జరగడం కష్టమే అని అంటున్నారు.