తమిళ అర్జున్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డాక్టర్లు

Published on Nov 28,2019 03:19 PM

అర్జున్ రెడ్డి తెలుగులో విడుదల అయ్యింది పెద్ద హిట్ అయ్యింది , కబీర్ సింగ్ గా హిందీలో విడుదల అయ్యింది అక్కడ ఇంకా పెద్ద హిట్ అయ్యింది కట్ చేస్తే ఇప్పుడు తమిళంలో '' ఆదిత్య వర్మ '' గా విడుదల అయ్యింది అయితే తెలుగులో , హిందీలో వచ్చిన విమర్శలు వేరు కానీ తమిళంలో ఈ సినిమాకు వస్తున్న విమర్శలు వేరు దాంతో షాక్ అవ్వడం తమిళ అర్జున్ రెడ్డి చిత్ర బృందం వంతయ్యింది. ఇంతకీ తమిళ అర్జున్ రెడ్డి చిత్రంపై వస్తున్న విమర్శలు ఏంటో తెలుసా ........

తమిళనాట డాక్టర్లు ఆదిత్య వర్మ చిత్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా డాక్టర్లని ఘోరంగా అవమానించేలా ఆదిత్య వర్మ చిత్రం ఉందని , ఆ సన్నివేశాలను తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేస్తున్నారు. అసలు సినిమానే డాక్టర్ నేపథ్యంలో సాగే చిత్రం అన్న విషయం తెలిసిందే. తెలుగులో అలాగే హిందీలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని పేద ఎత్తున విమర్శలు వచ్చాయి కానీ తమిళనాట మాత్రం డాక్టర్లు ఎదురు తిరిగారు అదీ విషయం .