విజయ్ దేవరకొండ ఎందుకు నిర్మాత అయ్యాడో తెలుసా ?

Published on Oct 30,2019 10:42 AM
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా మీకు మాత్రమే చెప్తా చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తరుణ్ భాస్కర్ హీరోగా అనసూయ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. కాగా ఆ వేడుకలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ కావడానికి అసలు కారణం చెప్పాడు. ఇంతకీ ఈ హీరో ఎందుకు నిర్మాత అయ్యాడో తెలుసా .......

తన లాగే అవకాశాల కోసం అందరి చుట్టూ తిరిగి విసిగి వేసారొద్దని ఇలా ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసాడట. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే కింగ్ ఆఫ్ డా హిల్స్ అని బ్యానర్ స్టార్ట్ చేసానని తెలిపాడు. ఈ సంస్థ పై టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉంటామని ప్రకటించాడు విజయ్ దేవరకొండ.