అనుష్క కు ఆ పేరు పెట్టిందెవరో తెలుసా ?

Published on Mar 13,2020 02:59 PM

అందాల భామ అనుష్క తాజాగా నిశ్శబ్దం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుకలో పాల్గొన్న పూరి జగన్నాధ్ అనుష్క కు ఆ పేరు ఎలా వచ్చిందో రివీల్ చేసాడు. అనుష్క అసలు పేరు స్వీటీ అయితే సినిమా కోసం అనుష్క గా మార్చాడు పూరి జగన్నాధ్. నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనుష్క.

అనుష్కకు ఎలాంటి పేరు పెడితే బాగుంటుందో అని ఆలోచిస్తున్న సమయంలో అనుష్క అనే యాంకర్ పూరి దగ్గరకు వచ్చిందట దాంతో ఆమె పేరునే స్వీటీ కి పెట్టాడట అలా స్వీటీ అనుష్క అయ్యింది. గత 15 ఏళ్లుగా తెలుగు ప్రజలను విశేషంగా అలరిస్తూనే ఉంది. మొదట్లో గ్లామర్ పాత్రలను పోషించినప్పటికీ ఆ తర్వాత మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకత ని సృష్టించుకున్న భామ అనుష్క. తెలుగునాట తిరుగులేని స్టార్ డం అందుకుంది అనుష్క.