రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?

Published on Dec 03,2019 08:06 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న రూలర్ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానున్న విషయం తెలిసిందే. దాంతో డిసెంబర్ 14 న రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఇక ఈ ఈవెంట్ ని ఎక్కడ చేస్తున్నారో తెలుసా...... వైజాగ్ లో. అవును డిసెంబర్ 14 న రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు సోనాల్ చౌహన్, వేదిక లు  నటిస్తున్నారు. 

చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు ఈ రూలర్ చిత్రానికి. బాలయ్య రెండు గెటప్ లలో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలాగే బిజినెస్ మెన్ గా నటిస్తున్నాడు. అయితే ద్విపాత్రాభినయం అయితే కాదనే అంటున్నారు. మరి ఈ రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ని బాలయ్య పోషిస్తూ అభిమానులను పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరిస్తున్నాడు. అయితే బాలయ్య లుక్ పై మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు కూడా.