మహేష్ బాబు టీజర్ వచ్చేది ఎప్పుడో తెలుసా ?

Published on Nov 18,2019 04:37 PM

మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం లోని టీజర్ ని విడుదల చేయబోతున్నాం అంటూ చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యేది ఎప్పుడో తెలుసా ........ నవంబర్ 23 న. ఇంతకీ నవంబర్ 23 ప్రత్యేకత ఏంటో తెలుసా ....... దర్శకులు అనిల్ రావిపూడి పుట్టినరోజు. అవును ఆరోజు అనిల్ పుట్టినరోజు కాబట్టి ఆ సందర్బంగా సరిలేరు నీకెవ్వరు టీజర్ ని విడుదల చేయనున్నారు.

మహేష్ బాబు మేజర్ ఆర్మీ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో విజయశాంతి నటిస్తోంది. కర్నూల్ ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఈ సినిమాలో ఉంది దాంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2020 జనవరి 12 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయశాంతి 13 ఏళ్ల తర్వాత నటిస్తున్న చిత్రం కూడా కావడంతో అంచనాలు అయితే బాగానే ఉన్నాయి మరి.