పూజా హెగ్డే కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

Published on Nov 27,2019 12:20 PM

కన్నడ భామ పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తూ బాగానే సొమ్ము చేసుకుంటోంది. సాలిడ్ హిట్ ఇంతవరకు ఈ భామ అందుకోలేదు అయినప్పటికీ పూజా హెగ్డే కు మాత్రం వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి. మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , తాజాగా ప్రభాస్ ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ఇక ఈ భామకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ........ ఇంకెవరు డార్లింగ్ ప్రభాస్.

డార్లింగ్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని అంటోంది పూజా హెగ్డే. ప్రభాస్ లాంటి స్వీట్ పర్సన్ ని నేను ఇంతవరకు చూడలేదు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది పూజా హెగ్డే. తాజాగా ఈ భామ ప్రభాస్ సరసన జాన్ అనే చిత్రంలో నటిస్తోంది. అందుకే కాబోలు ఇలా ప్రభాస్ అంటే ఇష్టమని స్టేట్ మెంట్ ఇస్తోంది. అయితే ఈ భామ ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ సాలిడ్ హిట్ ని మాత్రం అందుకోలేకపోతోంది. తాజాగా నటిస్తున్న అల వైకుంఠపురములో , జాన్ చిత్రాలతో నైనా బ్లాక్ బస్టర్ అందుకుంటుందా ? చూడాలి.