నాని - సుధీర్ బాబు ల మధ్య లొల్లి

Published on Mar 10,2020 08:30 PM

హీరో నాని , సుధీర్ బాబు ల మధ్య లొల్లి జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ హీరోలు ఇద్దరూ కలిసి నటించిన చిత్రం '' వి ''. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషించగా పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు నటించాడు. ఈ సినిమా ఈనెల 25 న ఉగాది కానుకగా విడుదల అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది దాంతో అక్కడే విబేధాలు వచ్చాయి ఇద్దరి మధ్య.

నాని కి సంబందించిన పర్సనల్ పీఆర్ టీమ్ నాని మాత్రమే హీరో అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారట అది సుధీర్ బాబు కు నచ్చలేదు పైగా తనని అవమానించినట్లే కదా ! అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి ఫిర్యాదు కూడా చేసాడట. వి చిత్రంలో ఇద్దరం నటించాం కానీ నాని ఒక్కడే హీరో అన్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఏమాత్రం బాగోలేదని తన బాధని , ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడట సుధీర్ బాబు.