దిశా పటాని తో రొమాన్స్ చేయనున్న అల్లు అర్జున్

Published on Aug 23,2019 05:15 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ''అల ...... వైకుంఠపురములో '' లో నటిస్తున్నాడు కాగా ఈ సినిమా కంప్లీట్ కాకముందే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో '' ఐకాన్ '' అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో హీరోయిన్ గా దిశా పటాని ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట . 

అసలు ఈ సినిమా కోసం అలియా భట్ ని తీసుకోవాలని అనుకున్నారు కానీ కుదరకపోవడంతో దిశా పటాని ని ఎంచుకునే పనిలో పడ్డారు . దిశా పటాని తెలుగులో లోఫర్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . హాట్ భామగా పేరొందిన ఈ భామ బాలీవుడ్ లో మంచి విజయాలనే సాధిస్తోంది . అల్లు అర్జున్ ఈ భామతో రొమాన్స్ చేయాలని ఆశపడుతున్నాడు . మరి ఈ భామ అల్లు అర్జున్ కు ఛాన్స్ ఇస్తుందా ? లేదా ? చూడాలి .