బన్నీ తో ఐటెం భామగా దిశా పటాని

Published on May 02,2020 11:32 AM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్ లను జరుపుకుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశా పటాని ఐటెం సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పుష్ప చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ అంటే తప్పకుండా యూత్ ని పిచ్చెక్కించే ఐటెం సాంగ్ ఉండటం ఖాయం.

ఇప్పటికే ఐటెం సాంగ్ కోసం కెవ్వు మనిపించే ట్యూన్ కట్టాడట దేవిశ్రీ ప్రసాద్. ఇక ఆ ఐటెం సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటుగా హాట్ భామ దిశా పటాని కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. దిశా పటాని బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో లోఫర్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు దాంతో ఈ భామని పట్టించుకోలేదు తెలుగువాళ్లు. ఐటెం సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ సుకుమార్ అందుకే ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ ని కూడా అదరహో అనిపించేలా చిత్రీకరించనున్నారట సుకుమార్. ఈ సినిమా తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషలలో విడుదల కానుంది.