డిజాస్టర్ సినిమా టీవీ ఛానల్ లో

Published on Apr 23,2020 04:31 PM
మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన పరమచెత్త సినిమాగా ప్రఖ్యాతి గాంచిన చిత్రం '' తిక్క '' . కాగా ఆ సినిమాని ఇన్నాళ్ళుగా ఎవరూ కొనలేదు అయితే దురదృష్టం కొద్దీ ఈ తిక్క సినిమాని స్టార్ మా ఛానల్ కొనుక్కుంది దాన్ని ఇక ఈ శుక్రవారం రోజున టెలికాస్ట్ చేయనున్నారు. ఇలాంటి చెత్త సినిమాని ఫలానా సమయానికి వేస్తున్నాం అని ప్రచారం కూడా చేస్తున్నారు. దాంతో ఆ సమయంలో సదరు ఛానల్ వాళ్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు అని తెలుస్తోంది.

ఛానల్ కు ఎందుకు ఇబ్బందులో తెలుసా ..... సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే పరమ చెత్త చిత్రాలు అంటూ ఓ నాలుగైదు ఉన్నాయి వాటిలో ఇది నెంబర్ వన్ అనే చెప్పాలి. అంత దారుణంగా ఉంది మరి ఈ సినిమా. నిజంగానే తిక్క సినిమా పెద్ద తిక్క సినిమానే. సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాలే మొత్తంగా 12 కాగా అందులో పరమచెత్త సినిమాలు 6 ఉన్నాయి. ఆ ఆరు మాణిక్యాలలో తిక్క ఒక్కటన్న మాట.