చిరంజీవిని పరిచయం చేసిన డైరెక్టర్ మృతి

Published on Feb 15,2020 08:56 PM

మెగాస్టార్ చిరంజీవిని నటుడిగా పరిచయం చేసిన చిత్రం పునాదిరాళ్ళు. ఈ చిత్రంతో తన కెరీర్ కు గట్టి పునాదిరాళ్లు గా మలుచుకున్నాడు చిరంజీవి. అయితే ఆ పునాదిరాళ్ళు చిత్రానికి దర్శకత్వం వహించింది రాజ్ కుమార్ . గతకొంత కాలంగా రాజ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల అనారోగ్యం మరీ విషమించడంతో తుది శ్వాస విడిచాడు. చిరంజీవి ని పరిచయం చేసిన రాజ్ కుమార్ ఇక లేరు అన్న విషయం చిరు కి తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
     ఆమధ్య కాలంలో అనారోగ్యానికి గురైన రాజ్ కుమార్ కు వైద్య సహాయం అందించారు చిరంజీవి. అయితే వయసు మీద పడటంతో పాటుగా ఆర్ధిక ఇబ్బందులు కూడా రాజ్ కుమార్ ని తీవ్రంగా వేధించాయి. చివరి రోజుల్లో అద్దె ఇంట్లోనే ఉన్నాడు ఈ దర్శకుడు రాజ్ కుమార్. పునాదిరాళ్ళు చిత్రం తర్వాత పలు చిత్రాలకు రాజ్ కుమార్ దర్శకత్వం వహించినప్పటికీ చిరుని పరిచయం చేసిన సినిమా కావడంతో పునాదిరాళ్ళు రాజ్ కుమార్ గానే ప్రసిద్ధి చెందాడు.