మహేష్ బాబు తో తరుణ్ భాస్కర్

Published on Feb 13,2019 03:55 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమా చేయడానికి తరుణ్ భాస్కర్ ప్రయత్నాలు చేస్తున్నాడట . పెళ్లిచూపులు చిత్రంతో సంచలన విజయం సాధించిన తరుణ్ భాస్కర్ తన రెండో చిత్రంగా ఈ నగరానికి ఏమైంది అనే చిత్రం చేసాడు . అయితే రెండో సినిమా దెబ్బకొట్టింది . దాంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు ఈ యువ దర్శకుడు , ఈ గ్యాప్ లో నటన మీద దృష్టి పెట్టాడు . 

ఇప్పటికే మహానటి , సమ్మోహనం చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన తరుణ్ తాజాగా హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నాడు . ఆ సినిమా అయ్యాక మహేష్ బాబు తో ఓ సినిమా చేయనున్నాడట . మహేష్ బాబు కు లైన్ చెప్పాడట అది మహేష్ కు నచ్చడంతో పక్కా స్రిప్ట్ తో రావాలని చెప్పాడట . పక్క స్క్రిప్ట్ మహేష్ కు నచ్చితే ఈ కాంబినేషన్ లో సినిమా ఖాయమే !