తరుణ్ భాస్కర్ రిస్క్ చేస్తున్నాడా

Published on Jan 21,2019 12:44 PM

పెళ్లిచూపులు చిత్రంతో ప్రభంజనం సృష్టించిన దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ , అయితే రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది ప్లాప్ కావడంతో దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నాడు . దర్శకుడిగా మొదటి చిత్రంతోనే అందరి ప్రశంసలతో పాటుగా పలు అవార్డులను అందుకున్నాడు అయితే దర్శకత్వాన్ని పక్కన పెట్టి నటుడిగా మారుతున్నాడు.

ఇది తరుణ్ భాస్కర్ రిస్క్ చేయడమే అని వినిపిస్తోంది , హాయిగా సినిమాలకు దర్శకత్వం చేసుకోక ఎందుకు ఇలా హీరోగా మారడం అంటూ విమర్శలు వస్తున్నాయి . ఇప్పటికే నటుడిగా మహానటి , సమ్మోహనం చిత్రాల్లో అలా కనిపించి మెప్పించాడు . అయితే చిన్న పాత్ర వేరు హీరో పాత్ర వేరు . సక్సెస్ అయితే మంచిదే ! కానీ ఒకవేళ సక్సెస్ కాకపోతే ఆ విమర్శలు మరింత పెద్దవి అవుతాయి . అంటే తరుణ్ భాస్కర్ రిస్క్ చేయడమే అన్నమాట .