మళ్ళీ అదే తప్పు చేస్తున్న శంకర్

Published on Oct 21,2019 03:35 PM

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. ఒకప్పుడు విలక్షణ చిత్రాలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు శంకర్ అయితే గత కొంత కాలంగా శంకర్ దర్శకత్వం వహించిన చిత్రాలు భారీ బడ్జెట్ మూలంగా అలాగే ఎక్కువ రోజుల పాటు షూటింగ్ జరుపుకోవడం వల్ల కూడా నిర్మాతలను నష్టాల బారిన పడేస్తున్నాయి. ఐ , 2. ఓ చిత్రాలు ఇలాగె దెబ్బతిన్నాయి.
అయితే తాజాగా కమల్ హాసన్ తో భారతీయుడు 2 అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలోని ఓ యాక్షన్ సీన్ కోసం ఏకంగా 40 కోట్లు ఖర్చు పెడుతున్నారట. శంకర్ కు గుడ్ విల్ పోతోంది అలాగే కమల్ హాసన్ గొప్ప నటుడే కానీ మార్కెట్ పరంగా మాత్రం ఒక్క తమిళనాట మాత్రమే స్టార్ డం ఇక మిగతా చోట్లా కమల్ కు అంతగా మార్కెట్ లేదు మరి ఇలాంటి పరిస్థితిలో శంకర్ మళ్ళీ భారీ బడ్జెట్ అందునా ఎక్కువ ఖర్చు పెడితే వర్కౌట్ అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది.