బూతులు తిట్టిన దర్శకుడు

Published on Mar 10,2020 08:08 PM

తన చిత్రంపై ఓ వెబ్ సైట్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆర్టికల్ రాయడంతో ఆవేశంతో ఊగిపోయిన దర్శకుడు అనుభవ్  సిన్హా బండబూతులు తిట్టాడు అయితే బూతులు మరీ ఎక్కువ కావడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు దాంతో తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాడు డైరెక్టర్ అనుభవ్ సిన్హా. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన '' థప్పడ్ '' చిత్రానికి దర్శకత్వం వహించాడు అనుభవ్ సిన్హా. ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. ఫస్ట్ వీక్ లో 23 కోట్లు వసూల్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా.

అయితే పెద్దగా కలెక్షన్లు రాలేదని ఇష్టమొచ్చినట్లుగా ఓ వెబ్ సైట్ లో థప్పడ్ గురించి ఇష్టానుసారంగా రాసారు అది అనుభవ్ కు విపరీతమైన కోపం తెప్పించింది. ఇంకేముంది బూతులు అందుకున్నాడు ఈ డైరెక్టర్. అవి మరీ శృతిమించడంతో నెటిజన్లు అనుభవ్ పై విరుచుకుపడ్డారు. దాంతో తన తప్పు తెలుసుకొని ఆవేశంలో సహనం కోల్పోయానని సారీ చెప్పాడు