ఖర్మరా బాబూ ! వర్మ కూడా హీరో అయ్యాడు

Published on Apr 08,2019 10:15 AM

హీరో అంటే ఒకప్పుడు ఒడ్డు పొడవు అంటూ రకరకాల విషయాలు చెప్పేవాళ్ళు కానీ కాలం మారింది హీరోగా  ఎవ్వరైనా నటించొచ్చు కావాల్సింది నటన కాదు జస్ట్ డబ్బు . డబ్బుంటే ఎవ్వడైనా హీరో కావచ్చు . ఇప్పటీకే బోలెడుమంది అలా వచ్చారు ఇలా వెళ్లారు . అయితే వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి రాంగోపాల్ వర్మ కూడా హీరో అయ్యాడు తాజాగా కోబ్రా చిత్రంతో . ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి  సంగీతం అందించనున్నాడు . 

ఇంటలిజెన్స్ అధికారిగా రాంగోపాల్ వర్మ నటించనున్న కోబ్రా సినిమా పోస్టర్ ని నిన్న రాత్రి రిలీజ్ చేసారు ఆ చిత్ర బృందం . ఈరోజు రాంగోపాల్ వర్మ పుట్టినరోజు కావడంతో కోబ్రా చిత్రాన్ని ప్రకటించారు . దర్శకుడిగా , నిర్మాతగా వ్యవహరించిన వర్మ హీరోగా ఎలాంటి ఫలితాన్ని పొందనున్నాడో తెలియాలంటే కోబ్రా రిలీజ్ అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే .