నితిన్ ట్వీట్ తో షాక్ అయిన డైరెక్టర్

Published on Mar 23,2019 12:22 PM

నితిన్ తన తదుపరి చిత్రాన్ని చంద్రశేఖర్ ఏలేటి తో చేయనున్నాడు . ఈ విషయాన్నీ గురించి ట్వీట్ చేస్తూ చంద్రశేఖర్ ఏలేటి తో మాత్రమే సినిమా చేస్తున్నానని ,అంతేకాని ఫేక్ న్యూస్ నమ్మకండి అంటూ ట్వీట్ చేసి దర్శకులు రమేష్ వర్మ కు షాక్ ఇచ్చాడు . నితిన్ ట్వీట్ తో తీవ్ర షాక్ కి గురైన రమేష్ వర్మ నిస్పృహలో మునిగిపోయాడు . 

రైడ్ , వీరా చిత్రాలకు దర్శకత్వం వహించాడు రమేష్ వర్మ . రైడ్ హిట్ కాగా వీరా చిత్రం మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది .  తాజాగా నితిన్ కు ఓ కథ చెప్పాడట రమేష్ వర్మ అయితే నితిన్ పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే రమేష్ వర్మ ఓ ప్రకటన జారీ చేసాడు నితిన్ తో సినిమా అని దాంతో నేను అఫీషియల్ గా చెప్పేదే సినిమా అంతేకాని ఫేక్ న్యూస్ నమ్మకండి అని ట్వీట్ చేసి పాపం రమేష్ వర్మ కు షాక్ ఇచ్చాడు .