ఎన్టీఆర్ -చరణ్ ల ప్రెస్ మీట్ త్వరలోనే - రాజమౌళి

Published on Mar 11,2019 10:59 AM

ఎన్టీఆర్ -చరణ్ ల కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం '' ఆర్ ఆర్ ఆర్ '' . ఇప్పటికే రెండు షెడ్యూల్ లను జరుపుకున్న ఈ చిత్ర ప్రెస్ మీట్ త్వరలోనే పెట్టనున్నారట . అల్యూమినియం ఫ్యాక్టరీ లో అలాగే రామోజీ ఫిలిం సిటీ లో పెద్ద ఎత్తున సెట్టింగ్స్ వేశారు ఈ చిత్రం కోసం . అలాగే అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి . 

మరో షెడ్యూల్ కోసం కోల్ కతా వెళ్ళడానికి రెడీ అవుతోంది చిత్ర బృందం దాంతో కోల్ కతా వెళ్లేముందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట జక్కన్న . ఈ మీడియా సమావేశం ఎందుకంటే ఇప్పటి నుండే సినిమాపై అంచనాలు మరింతగా పెంచడానికి అలాగే ఇంటర్నేషనల్ లెవల్ లో బిజినెస్ చేయాలనే ఆలోచనతోనట ! ఎన్టీఆర్ - చరణ్ ల సరసన నటించే భామల పేర్లు రకరకాలుగా తెరపైకి వస్తున్నాయి అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు .