ప్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు

Published on Mar 09,2019 11:45 AM

రాజుగారి గది సూపర్ హిట్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా రాజు గారి గది 2 చేసాడు ఓంకార్ . అయితే రాజుగారి గది 2 ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది . రెండో పార్ట్ లో నాగార్జున , సమంత లు ఉన్నప్పటికీ సక్సెస్ కాలేదు అయితే ఇప్పుడు రాజుగారి గది 3 కి ప్లాన్ చేస్తున్నాడు ఓంకార్ . హిట్ సినిమాకు సీక్వెల్ అంటే ఫరవాలేదు కానీ రెండో పార్ట్ ఆడకపోయినా మూడో పార్ట్ అంటూ మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఓంకార్ . 

బుల్లితెర పై యాంకర్ గా సక్సెస్ అయిన ఓంకార్ కు డైరెక్షన్ అంటే ఇష్టం దాంతో ఆ రెండు చిత్రాలు చేసాడు . ఇక ఇపుడేమో మరోసారి రాజుగారి గది 3 అంటున్నాడు . ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా ని తీసుకుంటున్నాడట . హర్రర్ చిత్రంలో ఆల్రెడీ తమన్నా నటించింది .