డిగ్రీ కాలేజ్ చిత్ర దర్శకుడు అరెస్ట్

Published on Feb 06,2020 09:23 PM

డిగ్రీ కాలేజ్ చిత్రంలో అశ్లీల దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయని , అలాగే అశ్లీల పోస్టర్ లను బహిరంగ ప్రదేశాలలో అంటించారని ఫిర్యాదు రావడంతో ఆ చిత్ర దర్శకుడు నరసింహ నందిని అరెస్ట్ చేసారు ఎస్సార్ నగర్ పోలీసులు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న దర్శకుడు నరసింహ నంది అయితే ఇటీవల డిగ్రీ కాలేజ్ అనే అశ్లీల చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా ఈరోజు విడుదల అవుతోంది దాంతో ప్రధాన కూడళ్లలో డిగ్రీ కాలేజ్ పోస్టర్ లను అంటించారు.

అయితే ఆ వాల్ పోస్టర్ లు అశ్లీలంగా ఉండటంతో ఎస్సార్ నగర్ పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఎస్సార్ నగర్ , అమీర్ పేట లలో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ తిరుగుతుంటారు దాంతో రోడ్ల పైకి రావాలంటే చాలా అవమానంగా ఉందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శకుడు నరసింహ నందిని , అలాగే నిర్మాత శ్రీనివాసరావుని అరెస్ట్ చేసారు పోలీసులు. పోస్టర్ లు అత్యంత జుగుప్సాకరంగా ఉండటంతో వాటిని తొలగించారు.