సాహో పై సెటైర్ వేసిన డైరెక్టర్

Published on Sep 03,2019 02:12 PM

ప్రభాస్ నటించిన సాహో చిత్రంపై సెటైర్ వేసాడు ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ సల్లే . సాహో చిత్రం మూల కథ జెరోమ్ సల్లే దర్శకత్వం వహించిన లార్గో వించ్ పోలి ఉండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అలాగే ఈ విషయం జెరోమ్ సల్లే కు చేరడంతో సాహో పై సెటైర్ వేసాడు. కాపీ కొట్టేది ఏదో సరిగ్గా కొట్టండి అంటూ ట్వీట్ చేసి చురకలు అంటించాడు జెరోమ్. 
ఫ్రెంచ్ లో వచ్చిన లార్గో వించ్ అనే సినిమాని కాపీ కొట్టి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి చిత్రాన్ని రూపొందించగా అది డిజాస్టర్ అయ్యింది. కట్ చేస్తే అదే మూల కథతో సాహో చిత్రం రూపొందింది కాకపోతే భారీ ఓపెనింగ్స్ సాధించింది సాహో . దాంతో స్పందించిన జెరోమ్ నాకు ఇండియాలో మంచి డిమాండ్ ఉన్నట్లుంది అని అంటున్నాడు.