తప్పు చేసానని బాధపడుతున్న డైరెక్టర్

Published on Feb 14,2020 06:20 PM
పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రంలో బాలకృష్ణ చేత కొన్ని సన్నివేశాలు చేయించకుండా ఉండాల్సింది అంటూ బాధపడుతున్నాడు సీనియర్ దర్శకులు బి. గోపాల్. ఒకప్పుడు బాలకృష - బి. గోపాల్ కాంబినేషన్ అంటే యమా క్రేజ్. ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం బయ్యర్లు పోటీ పడేవాళ్ళు కొనడానికి. లారీ డ్రైవర్ , రౌడీ ఇన్ స్పెక్టర్ , సమరసింహారెడ్డి , నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ నాలుగు చిత్రాలు కూడా ఒకదాన్ని మించిన హిట్ మరొకటిగా నిలిచాయి. దాంతో ఈ కాంబినేషన్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

సరిగ్గా అదే సమయంలో పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రం 5 వ చిత్రంగా వచ్చింది. బాలయ్య - గోపాల్ కాంబినేషన్ కాబట్టి బయ్యర్లు పోటీ పడి కొన్నారు కట్ చేస్తే సినిమా డిజాస్టర్ అయ్యింది. బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు. ఇంతకీ ఈ సినిమాలో బాలయ్య చేత ఏం చేయించాడో తెలుసా ....... తొడగొట్టి సవాల్ చేస్తే ఎదురుగా వస్తున్న ట్రైన్ అదే వేగంతో వెనక్కి వెళ్లిపోయే సీన్ , అంతేనా తొడకొట్టి కుర్చీని రమ్మని సైగ చేస్తే బాలయ్య దగ్గరకు పాకుకుంటూ కుర్చీ రావడం , ఇంకా చెప్పాలంటే కోడి ఓ పెద్ద రౌడీని చెంపేయడం లాంటి చెత్త చెత్త సీన్లు చాలానే ఉన్నాయి. ఆ సీన్లకు ప్రేక్షకులు మండిపోయారు అందుకే ఆ సినిమాని డిజాస్టర్ చేసారు. కట్ చేస్తే ఆ సన్నివేశాలు బాలయ్య చేత చేయించకుండా ఉండాల్సింది అంటూ బాధపడుతున్నాడు బి. గోపాల్.