విజయ్ సినిమాపై పుకార్లని ఖండించిన డైరెక్టర్

Published on Nov 18,2019 04:55 PM

తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాపై పుకార్లు షికారు చేస్తున్నాయి దాంతో ఆ పుకార్లని ఖండిస్తున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. కార్తీ నటించిన ఖైదీ చిత్రంతో దర్శకుడిగా సంచలన విజయం అందుకున్నాడు ఈ లోకేష్ కనగరాజ్. తాజాగా విజయ్ హీరోగా ఓ చిత్రం రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు అయితే విజయ్ - లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా రీమేక్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అవి నిజం కాదని కొట్టి పడేసాడు.

విజయ్ కోసం చేసిన కథ తోనే సినిమా చేయబోతున్నామని , రీమేక్ కాదని తేల్చి చెప్పాడు లోకేష్ కనగరాజ్. ఇక విజయ్ ఇటీవలే '' బిగిల్ '' తో సంచలన విజయం అందుకున్నాడు. ఇక ఈ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్ల ని సాధించింది. 11 కోట్ల వసూళ్ల ని సాధించి విజయ్ కి మంచి మార్కెట్ ని ఏర్పరిచింది.