నయనతారని మోసం చేసిన డైరెక్టర్

Published on Nov 06,2019 03:01 PM

దర్శకులు ఏ ఆర్ మురుగదాస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది హీరోయిన్ నయనతార. ఇప్పటికే మురుగదాస్ చేతిలో ఒకసారి మోసపోయానని , తాజా పరిస్థితి చూస్తుంటే మరోసారి మోసపోవడం ఖాయమని భావిస్తోందట నయనతార అందుకే అతడి పై కోపంతో ఊగిపోతోందట. 2008 లో సూర్య హీరోగా నటించిన గజినీ చిత్రంలో నయనతార కు చెప్పిన పాత్ర వేరట ! అయితే కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించి మిగతా సన్నివేశాలు చిత్రీకరించకుండా నన్ను మోసం చేసాడని ఇప్పటికీ బాధపడుతోంది నయనతార.

కట్ చేస్తే రజనీకాంత్ సరసన దర్బార్ చిత్రంలో నటిస్తోంది, అయితే ఈ చిత్రంలో కూడా తగినంత ప్రాధాన్యత లేదని భావిస్తోందట నయనతార దాంతో ఒకరోజు షూటింగ్ కు డుమ్మా కొట్టిందట. అయితే తనకే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి కాస్త బెట్టు దిగి మళ్ళీ షూటింగ్ కు వెళ్లిందట. ఇక ఈ సినిమా విడుదల అయితే కానీ తెలీదు నయనతార పాత్రకు ప్రాధాన్యత ఉందా ? లేదా ? అన్నది.