బోయపాటికి అవమానం

Published on Mar 01,2019 03:09 PM

మాస్ దర్శకులు బోయపాటి శ్రీను కి అవమానం జరిగిందా ? లేక తనని ఎవరూ అవమానించకముందే ఎవరి దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లు వాళ్లకు ఇచ్చేస్తే బెటర్ అని ఫీల్ అయ్యాడేమో మొత్తానికి తనకు అడ్వాన్స్ లు ఇచ్చిన వాళ్లకు తిరిగి డబ్బులు ఇచ్చేశాడట . ఇంతకీ బోయపాటి శ్రీను నిర్మాతలకు అడ్వాన్స్ లు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా ....... వినయ విధేయ రామ డిజాస్టర్ కావడమే ! 

రాంచరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రం జనవరి నెలలో రిలీజ్ అయి ఘోర పరాజయం పొందింది దాంతో బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు . ఆ ఎఫెక్ట్ బోయపాటి పై బాగా పడటంతో మెంటల్ గా చాలా ఇబ్బంది పడ్డాడట ! అందుకే అవమానం ఎదురు కాకముందే తనకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలకు ఆ డబ్బులు ఇస్తే మంచిదని ఇచ్చేశాడట బోయపాటి . ఇక బాలయ్య తో తన తదుపరి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బోయపాటి .