రెమ్యునరేషన్ పెంచిన అనిల్ రావిపూడి

Published on Mar 16,2019 03:12 PM

ఎఫ్ 2 సంచలన విజయం సాధించడంతో దర్శకుడు అనిల్ రావిపూడి తన రెమ్యునరేషన్ ని అమాంతం రెండింతలు పెంచాడు. ఎఫ్2 కి 5 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్న అనిల్ రావిపూడి తాజాగా మహేష్ బాబు తో చేసే సినిమా కోసం ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అయితే అనిల్ రావిపూడి సత్తా తెలిసిన దిల్ రాజు 9 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. 

మహేష్ బాబు తో అనిల్ రావిపూడి చేయనున్న చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్న విషయం తెలిసిందే. ఎఫ్ 2 కూడా దిల్ రాజు నిర్మించాడు కాగా ఆ సినిమా లాంగ్ రన్ లో దాదాపు 85 కోట్ల షేర్ రాబట్టింది దాంతో దిల్ రాజు కు భారీ ఎత్తున లాభాలు వచ్చాయి అందుకే మళ్లీ అనిల్ రావిపూడి తోనే సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు 9 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నాడట అనిల్ కు.