డైరెక్టర్ అనిల్ రావిపూడిపై బండ్ల గణేష్ ఆగ్రహం

Published on Jan 24,2020 09:47 PM

సరిలేరు నీకెవ్వరు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు నటుడు , నిర్మాత బండ్ల గణేష్. ఇంతకీ బండ్ల గణేష్ కు అనిల్ రావిపూడి మీద ఇంత కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ........ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నాపై చాలా సన్నివేశాలు చిత్రీకరించి అందులో కొన్ని మాత్రమే సినిమాలో ఉంచాడని దానివల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని అనిల్ రావిపూడి పై దుమ్మెత్తి పోస్తున్నాడు.

నా క్యారెక్టర్ పరిచయ కార్యక్రమంతో పాటుగా ముగింపు కూడా ఉంటుందని అయితే వాటిని కట్ చేసి కొన్ని సీన్లు మాత్రమే ఉంచారని ఆరోపిస్తున్నాడు బండ్ల. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో బండ్ల గణేష్ బ్లేడ్ గ్యాంగ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ట్రైన్ ఎపిసోడ్ లో బండ్ల వచ్చేది కొద్దిసేపే అయినప్పటికీ నవ్వులు పూయించాడు. అయితే నా పాత్ర నిడివి తగ్గించాడు అని దర్శకుడి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం ముమ్మాటికీ బండ్ల చేసిన తప్పే !