పెళ్లి వార్తలన్నీ అబద్దాలేనట

Published on Mar 29,2019 11:52 AM

హీరోయిన్ సాయి పల్లవిని ప్రేమిస్తున్నట్లు , త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయని అవన్నీ అబద్దాలే అంటూ కొట్టిపడేసాడు దర్శకులు ఏ ఎల్ విజయ్ . మేమిద్దరం మంచి స్నేహితులం అంతకుమించి మా మధ్య ఏమి లేదు అంటూ తేల్చి చెప్పాడు విజయ్ . అంతేకాదు ప్రస్తతం నా దృష్టి అంతా జయలలిత బయోపిక్ మీదే ఉందని మరో ఆలోచన లేదని చెబుతున్నాడు కూడా . 

గతకొంత కాలంగా తమిళ మీడియాలో సాయి పల్లవి - ఏ ఎల్ విజయ్ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి అంతేకాదు పెళ్లి కూడా చేసుకోనున్నారని ఆ కథల సారాంశం . దాంతో ఇలా స్పందించాడు ఏ ఎల్ విజయ్ . అయితే విజయ్ స్పందించాడు కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా ! ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్న మాట నిజం అయితే బ్రేకప్ అయ్యిందా ? లేక ఇలా ఊరికే గాలి వార్తలు అంటూ కొట్టి పడేస్తున్నాడా కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ తెలీదు .