రాజమౌళి ని టార్గెట్ చేసిన దిల్ రాజు

Published on Dec 23,2019 09:03 AM

దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి ని టార్గెట్ చేసాడు అగ్ర నిర్మాత దిల్ రాజు అందుకే రాజమౌళి అన్నయ్య కొడుకులు శ్రీసింహా హీరోగా నటించగా కాలభైరవ సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్న సినిమా మత్తు వదలరా ..... ఈనెల 25 న విడుదల అవుతోంది. ఇక దానికి పోటీగా దిల్ రాజు నిర్మించిన '' ఇద్దరి లోకం ఒకటే '' చిత్రాన్ని కూడా డిసెంబర్ 25 న విడుదల చేస్తున్నాడు. ఇద్దరి లోకం ఒకటే చిత్రంలో రాజ్ తరుణ్ హీరోగా నటించగా షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

రాజమౌళి అన్నయ్య కొడుకుల సినిమా విడుదల అవుతున్న సమయంలోనే తన సినిమాని విడుదల చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నాడు. రాజమౌళి వారసుల సినిమాకు సరైన పోటీ లేకపోతే కొంచెం బెటర్ ఓపెనింగ్స్ తో పాటుగా బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉండేది కానీ దిల్ రాజు సినిమా పోటీకి వస్తుండటంతో మొదటి ఆప్షన్ ఎలాగూ రాజ్ తరుణ్ సినిమానే అవుతుంది. ఒకవేళ రాజ్ తరుణ్ - దిల్ రాజు ల సినిమా బాగోకపోతే అప్పుడు రాజమౌళి వారసుల సినిమా మంచి ఫలితాన్ని అందుకోవచ్చు. అయితే ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు మత్తు వదిలేలా చేస్తారు.