దిల్ రాజు ని ఖంగుతినిపించిన విజయ్ దేవరకొండ

Published on Jan 29,2019 02:16 PM

విజయ్ దేవరకొండ షాక్ ఇచ్చాడు నిర్మాత దిల్ రాజు కు . విజయ్ దేవరకొండ దిల్ రాజు కు షాక్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? దిల్ రాజు విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసాడు దాంతో డేట్స్ కోసం వెళితే పది కోట్ల రెమ్యునరేషన్ అడిగాడట . ఇంకేముంది దిల్ రాజు ఖంగుతిన్నాడు విజయ్ అడిగిన రెమ్యునరేషన్ విని . 

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజీ హీరో దాంతో అతడితో సినిమాలు చేయడానికి పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారు . దీపం ఉండగనే ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు ఈ హీరో . ప్రస్తుతం పది కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట విజయ్ దేవరకొండ .