కోర్టుకెక్కిన దిల్ రాజు

Published on Feb 04,2020 07:58 PM
కోర్టుకెక్కిన దిల్ రాజు

తన సినిమాకు సంబందించిన ఫోటోలు , వీడియోలు ప్రచురించొద్దని , మా సినిమాకు సంబందించిన వివరాలు బయటకు పొక్కేలా చేస్తే ఎవరిని కూడా క్షమించేది లేదని కోర్టుని ఆశ్రయించాడు నిర్మాత దిల్ రాజు. తాజాగా ఈ నిర్మాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో లాయర్ సాబ్ గా రీమేక్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని సన్నివేశాలు , ఫోటోలు లీక్ అవుతున్నాయి.

వరుసగా ఫోటోలు , వీడియోలు లీక్ అవుతుండటంతో వాటిని అదుపు చేయడం కష్టం అవుతోంది దిల్ రాజుకు. ఇలా లీక్ లు అవుతుండటంతో పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడట. దాంతో ఇలా లీకులు జరిగితే ఇకపై సహించేది లేదని ...... ఇలా చేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటానని కోర్టు ని ఆశ్రయించాడు.ఏడాది  జైలు శిక్ష తో పాటుగా 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నాడు దిల్ రాజు.